అమరావతి : పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి భాజలు మోగిన ఆ ఇంట నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతుంది. ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా వధువు మృతి చెందగా వరుడు పరిస్థితి విషమంగా ఉంది . అతడిని గుంటూరు ప్రభుత్వా సుప్పత్రికి తరలించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.