AP DGP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలో కొత్త డీజీపీని నియమించనున్నారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అందుకే కొత్త డీజీపీ ఎంపిక కోసం కసరత్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో డీజీపీ రేసులో ఎవరున్నారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పలువురు సీనియర్ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
అయితే ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావునే మరికొంత కాలం ఏపీ డీజీపీగా కొనసాగించవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్రంలో తనకు ఉన్న పరపతిని ఉపయోగించి ఏపీ సీఎం చంద్రబాబు ద్వారకా తిరుమలరావును మరికొంత కాలం కొనసాగిస్తారనే టాక్ వినబడుతోంది. ఒకవేళ ద్వారకా తిరుమలరావు పదవీకాలం పొడిగింపు సాధ్యం కాకపోతే.. ఆయన తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన హరీశ్ కుమార్ గుప్తాకు అవకాశం దక్కనుంది.