అమరావతి : ఏపీ నూతన డీజీపీ ద్వారకా తిరుమలరావు(DGP Dwaraka Tirumal Rao) సీఎం చంద్రబాబు(Chandra Babu)ను ఛాంబర్లో శుక్రవారం కలిశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన చంద్రబాబును కలిసి డీజీపీగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూర్పాలెంలో మహిళ అత్యాచారం హత్య ఘటన కేసును సీరియస్గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న డీజీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమల రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఇంద్రకీలాద్రి(Indrakeeladri) అమ్మవారిని డీజీపీ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం, చిత్రపటం ఆలయ అధికారులు అందజేశారు.