Lakshmi Narayana | ఏపీలో ప్రభుత్వ మార్పుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే లక్ష కోట్లకు పైగా బడ్జెట్ కావాలని తెలిపారు. వాళ్లు ఇచ్చిన అన్ని హామీలు అమలు నెరవేరాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని సూచించారు.
కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్నందను ప్రత్యేక హోదా డిమాండ్ చేసే పరిస్థితి లేదని వైఎస్ జగన్ గతంలో చెప్పారని జేడీ లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి డిమాండ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చాయని.. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని సూచించారు. విశాఖ రైల్వే జోన్ వెంటనే ప్రారంభమయ్యేలా చూడాలని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కోరారు. ఈ ఐదేళ్లు చాలా కీలకమని.. ఇప్పుడు అభివృద్ధి చేయకపోతే రాష్ట్రం బాగుపడదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా లేకపోతే కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయడానికి.. గత ప్రభుత్వం చేసిన అప్పుల కంటే ఎక్కువగా చేయాల్సి వస్తుందని అన్నారు.