అమరావతి : వియత్నాం ( Vietnam )లో చిక్కుకుపోయిన పర్యాటకులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూడాలని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హాలాంగ్ బే వద్ద జరిగిన బోటు బోల్తా ( Boat Over turn ) ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పర్యాటకులు దుర్మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు.
మచిలీపట్నం,కడప ప్రాంతాలకు చెందిన పలువురు మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో కలిచి వేసిందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు . ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. వియత్నాంలో చిక్కుకుపోయిన పర్యాటకులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూడాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
మరోవైపు దిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో ఏపీ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. వియత్నాంలో పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనలో ఏపీ వాసులు మృతి చెందిన నేపథ్యంలో వియత్నాంలోని భారత ఎంబసీ అధికారులతో మాట్లాడారు. పడవ ప్రమాద ఘటనలో మొత్తం 15 మంది చెందగా మరో 21 మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ మొబైల్ కంపెనీ భారత్‌కు చెందిన డిస్ట్రిబూటర్ల కుటుంబాలను వియత్నాం పర్యటనకు తీసుకెళ్లింది. మొత్తం 250 మందిని తీసుకెళ్లగా వీరు ప్రయాణిస్తున్న మూడు బోటులో ఒక బోటు తీవ్ర అలలు,గాలుల కారణంగా బోల్తా పడి ప్రమాదం జరిగింది.