అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం (Coalition government ) అధికారంలో వచ్చిన తరువాత అదివరకు ఉన్న ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తుంది . చంద్రబాబు(Chandra Babu) హయాంలో ప్రారంభించిన పథకాల పేర్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటి పేర్లను వైఎస్ జగన్(YS Jagan) మార్చి వేశారు.
ఎన్టీఆర్ వర్సిటీ పేరును మార్చి వైఎస్సార్ వర్సిటీగా నామకరణం చేశారు. దాదాపు అన్ని పథకాల పేర్లను జగన్ మార్చి వేశారు. తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొన్ని పథకాలకు 2014-19వరకు ఉన్న పాత పేర్లను ఉంచుతూ మరి కొన్నింటికి పూర్తిగా పేర్లను మారుస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యాశాఖలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల పేర్లను ( Scheme Name Change) మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . అమ్మఒడి పథకం పేరును ‘తల్లికి వందనం’ (Talliki Vandanam), విద్యాకానుక పథకం పేరును ‘ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’గా పేరును మార్చింది. గోరుముద్ద పథకం పేరును ‘డొక్క సీతమ్మ (Dokka Sitamma) మధ్యాహ్న బడి భోజనంగా , నాడు-నేడు పథకం పేరును ‘మన బడి, మన భవిష్యత్గా మార్చింది. స్వేచ్చ పథకం పేరును బాలికా రక్షగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆణిముత్యాలు పథకం పేరును ‘అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారంగా నామకరణం చేసింది.