అమరావతి : ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత ప్రభుత్వ పథకాల (Government Schemes) కు ఉన్న పేర్లను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలన(YCP Rule) కు ముందు ఉన్న పేర్లను ఉంచుతూ మరి కొన్నింటికీ పేర్లను మార్పిడి చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏపీ మంత్రి డోలా వీరాంజనేయస్వామి (Minister Dola Veeranjaneya Swamy) ఆదేశాలతో ఉత్తర్వులను జారీ చేశారు.
ఇదివరకు ఉన్న జగనన్న(Jaganna ) విద్యా, వసతి దీవెనల పథకాలకు పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్గా, జగనన్న విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరును మార్చారు. వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకానికి చంద్రన్న పెళ్లికానుకగా, వైఎస్ఆర్ విద్యోననతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా , జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకాన్ని సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.