Naga Babu | పదేళ్ల కల నెరవేరిందని.. ప్రజా ప్రస్థానం మొదలైందని మెగా బ్రదర్ నాగబాబు కొణిదెల అన్నారు. శాసనసభలో ప్రమాణస్వీకారం చేస్తున్న తన తమ్ముడు పవన్ కల్యాణ్‌ను చూసి తన మనసు ఆనందంతో ఉప్పొంగిపోయిందని తెలిపారు. తోడబుట్టిన వాడిగా, జనసేన కార్యకర్తగా తమ నాయకుడి ప్రమాణస్వీకారం చూసి తన గుండె ఆనందంతో నిండిపోయిందని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ అసెంబ్లీకి వెళ్లాలనేది.. ‘పవన్ కల్యాణ్ అను నేను’ అని ప్రమాణస్వీకారం చేయడం చూడాలన్నది తన పదేండ్ల కల అని నాగబాబు తెలిపారు. అసెంబ్లీకి రావడం, గ్యాలరీలో కూర్చోవడం తనకు ఇదే మొదటిసారి అని అన్నారు. చాలా థ్రిల్లింగ్‌గా ఉందని ఆనందాన్ని పంచుకున్నారు. పవన్ కల్యాణ్ విజయం సాధించినందుకు తమ కుటుంబమంతా చాలా సంతోషంగా, గర్వంగా ఫీలవుతున్నారని చెప్పారు.
పవన్ కల్యాణ్‌కు ఇంతటి అఖండ విజయాన్ని అందించిన ప్రతి ఓటర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని నాగబాబు అన్నారు. తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలకు నిజాయతీతో, నిష్పక్షపాతంగా అన్ని విధాల అంతఃకరణశుద్ధితో న్యాయం చేస్తారని నిర్భయంగా తెలియజేస్తున్నానని అన్నారు.
పదేళ్ల కల నెరవేరింది,ప్రజా ప్రస్థానం మొదలైంది:
డిప్యూటీ C.M హోదా లో శాసనసభ లో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది,
తోడబుట్టిన వాడిగా & జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది,… pic.twitter.com/Bg2UewPmSp
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 21, 2024