అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సోదరుడు, సినినటుడు నాగబాబు (Naga Babu) రాజకీయ పదవులపై స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదిక ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘నా నాయకుడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు సేవ చేయడమే తప్ప నాకు రాజకీయ ఆశయాలు లేవని ’ స్పష్టం చేశారు.
రాజ్యసభ (Rajya Sabha post) పదవి కోసం ఢిల్లీ పెద్దలను సంప్రదించారని వచ్చిన వార్తలను ఖండిస్తూ అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు,అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే ఉంటాడని వెల్లడించారు.
అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు. పోరాడతాడు. ఢిల్లీ వెళ్లిన ఉద్దేశం, స్వార్థ ప్రయోజనాలకోసం కాదని పేర్కొన్నారు . మన రాష్ట్ర ప్రయోజనాలకోసం, పవన్ లాంటి నాయకుడికోసం నా లైఫ్ ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేస్తూ ట్విట్ చేశారు.