ఆత్మగౌరవం ఉన్న వాళ్లు బయటకు రావాలి: నాదెండ్ల మనోహర్
ఒక సినిమాకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించడం కోసం ప్రభుత్వం యత్నించడం ఇదే తొలిసారి అని, తానూ ఇప్పుడే చూస్తున్నానని నాదెండ్ల మనోహర్ అన్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని థియేటర్ల వద్ద...
విజయవాడ: ఒక సినిమాకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించడం కోసం ప్రభుత్వం యత్నించడం ఇదే తొలిసారి అని, తానూ ఇప్పుడే చూస్తున్నానని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అహంకారంతో సినిమా థియేటర్ల వద్ద కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. భీమ్లా నాయక్ సినిమాకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఫ్యాన్స్ విజయవంతం చేస్తారని గుర్తు చేశారు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఆత్మగౌరవం ఉన్న వాళ్లు అంతా వైసీపీ నుంచి బయటకు రావాలని మనోహర్ పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు నమ్మి అధికారాన్ని ఇస్తే.. జగన్ ఇలాంటి ప్రజా వ్యతిరేక పాలనను అందిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా క్షేత్రస్థాయిలో జరిగిన అధికార దుర్వినియోగాన్ని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతున్నదని చెప్పారు. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని చెప్పిన జగన్.. పవన్ కల్యాణ్ నటించిన సినిమా విషయంలో మాత్రం అభిమానులను నిరుత్సాహపర్చేలా వ్యవహరించారన్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని థియేటర్ల వద్ద భయభ్రాంతులు సృష్టించారని చెప్పారు.
కక్ష పూరితంగా, నియంతలా వ్యవహరిస్తూ తన ఆలోచన మేరకు అధికారులు పనిచేయాలనడం జగన్ కు తగదని నాదెండ్ల మనోహార్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మే వైసీపీ నాయకులు ఇప్పటికైనా ఆత్మగౌరవంతో బతికేందుకు వెంటనే ఆ పార్టీ నుంచి బయటకు రావాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిళ్లు, అవమానాలు ఎదురైనా హుందాగా వ్యవహరించడం పట్ల పవన్ కల్యాణ్ అభిమానులకు అభినందనలు తెలుపుతున్నానన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

