అమరావతి : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ(63)మృతి పట్ల విశాఖ ఎంపీ, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు భగవంతుడు శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేమూరి కనకదుర్గ నగరంలో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
కనకదుర్గ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
ABN ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ గారి సతీమణి వేమూరి కనక దుర్గ(63)గారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం. ఈ కష్టకాలంలో ఆయనకు , కుటుంబ సభ్యులకు భగవంతుడు శక్తినివ్వాలని ప్రార్ధన.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 27, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి