ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామకృష్ణరాజు డిశ్చార్జ్
ఎంపీ రఘురామకృష్ణరాజు | సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు బుధవారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. రఘురామ ఆరోగ్యం

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు బుధవారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. రఘురామ ఆరోగ్యం కోలుకోవడంతో.. ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయల్దేరి వెళ్లారు ఎంపీ రఘురామ. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ర్ట సీఐడీ అధికారులు రఘురామను అరెస్టు చేసి గుంటూరుకు తరలించిన సంగతి తెలిసిందే.
అయితే తనను సీఐడీ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని పేర్కొంటూ ఎంపీ నేరుగా సుప్రీంలో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశానుసారం రాఘురామకృష్ణరాజుని ఆర్మీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్మీ ఆస్పత్రి నివేదిక అనంతరం బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీం రఘురామకృష్ణరాజుకు బెయిల్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఎంపీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం పేర్కొన్న విషయం విదితమే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

