గుంటూరు జిల్లా జైలుకు ఎంపీ రఘురామకృష్ణరాజు
గుంటూరు జిల్లా జైలుకు ఎంపీ రఘురామకృష్ణరాజు | పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీని సీఐడీ పోలీసులు గుంటూరు జిల్లా కేంద్ర జైలుకు తరలించారు. రఘురామ తరలింపు నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అమరావతి : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీని సీఐడీ పోలీసులు గుంటూరు జిల్లా కేంద్ర జైలుకు తరలించారు. రఘురామ తరలింపు నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే ఆయనను గుంటూరు గవర్నమెంట్ జనరల్ దవాఖాన నుంచి నేరుగా జిల్లా కేంద్ర జైలుకు తీసుకెళ్లారు. నిన్న రఘురామకు సీఐడీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. మరో వైపు కోర్టుకు సమర్పించాల్సిన మెడికల్ బోర్డు నివేదికలో జాప్యం జరుగుతుండటంతో రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూర్ సీఐడీ కార్యాలయంలో పోలీసులు తనను కొట్టారని నిన్న రఘురామ సీఐడీ కోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ తరఫు న్యాయవాదులు ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించారు. ఈ క్రమంలో రఘురామకు పరీక్షలు నిర్వహించి మెడికల్ బోర్డు నివేదిక అందజేయాలని జిల్లా కోర్టు, హైకోర్టు డివిజన్ బెంచ్ కోరింది. పరీక్షలు పూర్తికావడంతో హైకోర్టుకు నివేదిక అందించేందుకు మెడికల్ బోర్డు కమిటీ సభ్యులు సన్నద్ధమవుతున్నారు. మరికాసేపట్లో మెడికల్ బోర్డు నివేదిక హైకోర్టుకు చేరే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

