గురువారం 25 ఫిబ్రవరి 2021
Andhrapradesh-news - Jan 26, 2021 , 13:13:15

కూతుళ్ల హ‌త్య కేసు.. త‌ల్లికి వ‌ద‌ల‌ని క్షుద్ర‌పిచ్చి..

కూతుళ్ల హ‌త్య కేసు.. త‌ల్లికి వ‌ద‌ల‌ని క్షుద్ర‌పిచ్చి..

చిత్తూరు : న‌వ మాసాలు మోసి క‌నిపెంచి చివ‌ర‌కు త‌న చేతుల‌తోనే ఇద్ద‌రు కూతుళ్ల‌ను హ‌త్య చేసిన త‌ల్లి క్షుద్ర పిచ్చిని వ‌ద‌ల‌డం లేదు. మ‌ద‌న‌ప‌ల్లి జంట హ‌త్య‌ల కేసులో త‌ల్లీదండ్రులు పురుషోత్తం రెడ్డి, ప‌ద్మ‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం వారిని నేరుగా ఆస్ప‌త్రికి త‌ర‌లించి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అయితే క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ప‌ద్మ‌జ విచిత్రంగా ప్ర‌వ‌ర్తించింది. క‌రోనా టెస్టుకు స‌హ‌క‌రించ‌లేదు. క‌రోనా చైనా నుంచి రాలేదంటూ పిచ్చిగా మాట్లాడింది. తాను శివుడ్ని.. త‌న‌కు క‌రోనా ప‌రీక్ష ఏంట‌ని ప్ర‌శ్నించింది. చెత్త‌ను క‌డిగేసేందుకు క‌రోనాను త‌న శ‌రీరం నుంచి పంపించేశాన‌ని ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్యాఖ్యానించింది. ప‌ద్మ‌జ వింత ప్ర‌వ‌ర్త‌న‌తో పోలీసులు విసుగు చెందుతున్నారు.

VIDEOS

logo