అమరావతి : ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోరం జరిగింది. ఎన్జీవో కాలనీలో తల్లి , ఇద్దరు పిల్లలు అనుమానాస్పదంగా ( Suspicious Death) మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది . మల్లిక(26), ఇషాన్ సాయి ( 2 ) , పరిమిత ( 7 నెలలు) ఇంటిలో మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
మృతదేహాలను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిని ఎవరైనా హత్య చేశారా? ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది