నగరిని బాలాజీ జిల్లాలో కలపండి : సీఎస్‌కు రోజా లేఖ
నగరి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన బాలాజీ జిల్లాలో కలపాలని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కోరారు. గురువారం ఆమె ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మను కలసి...
అమరావతి: నగరి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన బాలాజీ జిల్లాలో కలపాలని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కోరారు. గురువారం ఆమె ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మను కలసి వినతిపత్రం అందచేశారు. అలాగే, మండల, మున్సిపాలిటీ కార్యవర్గాలు చేసిన తీర్మానాల కాపీలను కూడా ఆయనకు అందించారు. తిరుపతితో నగరి నియోజకవర్గ ప్రజలకు ఉన్న అనుబంధాన్ని సమీర్ శర్మకు వివరించారు.
తిరుపతి పట్టణానికి 9 కిలోమీటర్ల దూరం నుంచి నగరి నియోజకవర్గం ప్రారంభమవుతుందని రోజా తెలిపారు. నగరి నియోజకవర్గం మొత్తం తిరుపతికి వెళ్లే జాతీయ రహదారిని ఆనుకునే ఉంటుందని చెప్పారు. నగరి నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాలు తిరుపతి అర్బన్ డెవెలెప్మెంట్ అథారిటీకి ఆస్తి పన్ను చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. పుత్తూరు, నగరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బాలాజీ జిల్లా పేరిటే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని సమీర్ శర్మ దృష్టికి తీసుకొచ్చారు. నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో ఉండేలా నిర్ణయం తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

