అమరావతి : ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ (Bhuma Akhilapriya) విజయడైరీ చైర్మన్ (Vijaya Dairy Chairman) జగన్మోహన్రెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. విజయడైరీకి ఎమ్మెల్యే వచ్చి, చైర్మన్ సీట్లో కూర్చొవడాన్ని తెలుసుకున్న మామ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ హోదాలో డైరీని సందర్శించి , చైర్మన్ సీట్లో కూర్చున్నావని ఫోన్లో ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
మామ హోదాలో మాట్లాడుతున్నావా? చైర్మన్ హోదాలో మాట్లాడుతున్నావో స్పష్టం చేయాలని అఖిలప్రియ కోరారు. మామగా అయితే పర్వలేదు గాని చైర్మన్‌గా ప్రశ్నిస్తే రిటర్న్‌గా ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు. ఒక దశలో నన్ను బెదిరిస్తున్నావా అంటూ నిలదీశారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి వందరోజుల పూర్తవుతున్నా ఇంకా డైరీలో మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఫొటోను ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. అప్పటికప్పుడు సీఎం చంద్రబాబు ఫొటో తెప్పించి ఆమెనే స్వయంగా గోడకు అమర్చారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) శిలాఫలకాన్ని తొలగించడాన్ని ఆమె తప్పుబట్టారు. తొలగించాలని ఆదేశాలు ఎవరు ఇచ్చారో తెలుపాలని, శిలాఫలకం డ్రైనేజీలో పడవేసినందుకు చైర్మన్, అధికారులు రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని పాలతో శుభ్రం చేయించారు.