అమరావతి : దుర్గాదేవి మండపం ( Durgadevi) వద్ద నిర్వహించిన అన్నదానం (Annadanam) లో అపశృతి దొర్లింది. ప్రమాదవశాత్తు అన్నం గంజి ( Porridge) మీద పడి 16 మంది చిన్నారులతో పాటు మహిళలకు గాయాలయ్యాయి. విశాఖ జిల్లా జాలరిపేట పిల్లా అన్నమ్మయ్య సంఘం వద్ద దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. శనివారం అన్నదానం నిర్వహించగా అక్కడికి వచ్చిన పిల్లలు, మహిళలపై ప్రమాదవశాత్తు వారిపై గంజి పడింది.
దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వెంటనే విశాఖలో కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే వంశీకృష్ణ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ ప్రమాదంలో 6 గురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రిలో చికిత్స అందించి మిగతా వారికి చికిత్స అనంతరం వారివారి ఇళ్లకు పంపించారు. ఎన్టీఆర్ వైద్యసేవాల ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ గాయపడ్డ చిన్నారునలు పరామర్శించారు.