హైదరాబాద్, జూన్16 (నమస్తే తెలంగాణ): వచ్చే 30 నెలల్లో అమరావతిలో ఏపీ రాజధాని నిర్మాణ పనులు పూర్తిచేసే లక్ష్యంతో ముందుకు సాగుతామని ఏపీ మంత్రి నారాయణ వెల్లడించారు. వెలగపూడిలో ఆదివారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
మూడు దశల్లో చేపట్టనున్న రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్ల వ్యయం అవుతుందని, మొదటి దశ పనులకు 48 వేల కోట్లు ఖర్చవుతుందని వివరించారు. 15 రోజులపాటు అధ్యయనం చేసి నిర్దేశిత గడువుతో పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు.