YCP Leader Sajjala | డీఎస్సీలో అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి : వైసీపీ నాయకుడు సజ్జల
YCP Leader Sajjala | ఏపీలో నిర్వహించిన డీఎస్సీ 2025లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
అమరావతి : ఏపీలో నిర్వహించిన డీఎస్సీ 2025లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీలో అడ్డంగా టీచర్ పోస్టులు ( Teacher Posts ) అమ్ముకున్నారని ఆరోపించారు.
అడ్డదారుల్లో కొందరికి ఎలా ఉద్యోగాలు వచ్చాయో బయటపడుతున్నాయని పేర్కొన్నారు. వీటిని డిఫెండ్ చేసుకోవడానికి ఇద్దరు మహిళా అధికారులను ఎంపిక చేసుకుని పాత విషయాలనే వెల్లడిస్తున్నారని విమర్శించారు. డీఎస్సీ కుంభకోణం చిన్న విషయం కాదు. చేసిన వ్యక్తులు చిన్న వాళ్లు కాదు అని స్పష్టం చేశారు. ఈ అంశంపై వైసీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ స్కాంకు మూల సూత్రదారి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నారు. అక్రమాలపై ప్రతిపక్షాలు నిలదీస్తే బుకాయింపు,, బెదిరింపులకు పాల్పడుతున్నారని వివరించారు. డీఎస్సీలో సెలక్ట అయిన వాళ్లంతా అడ్డదారుల్లో వచ్చిన వాళ్లు కాదని, ఉద్యోగం రాని వారికి అంతా అండగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటివి జరగవనే భరోసా కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

