నెల్లూరు జిల్లా రాజకీయంలో ఆసక్తికర పరిణామం జరిగింది. కొన్ని రోజుల పాటు మంత్రి కాకాణిపై మాజీ మంత్రి అనిల్ యాదవ్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ సమయంలో అనిల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో వీరిద్దరూ కలిసి మంత్రికి వ్యతిరేకంగా మారతారన్న ఊహాగానాలు వచ్చాయి.ఈ నేపథ్యంలో మంత్రి కాకాణి మంగళవారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో భేటీ అయ్యారు.
తామిద్దరమూ బాల్య స్నేహితులమంటూ కాకాణి పేర్కొన్నారు. తామిద్దరమూ ఒకే నెలలో పుట్టామని, అయితే.. తానే ముందు పుట్టానని కాకాణి చెప్పుకొచ్చారు. తాను ముందు పుట్టినా… రాజకీయాల్లో మాత్రం ఎమ్మెల్యే కోటంరెడ్డే ముందు ప్రవేశించారని, ఆయనే సీనియర్ అన్నారు. అసలు సీఎం జగన్‌కి తనను శ్రీధర్ రెడ్డే పరిచయం చేశారని వెల్లడించారు. అయితే.. ఇద్దరమూ సమ ఉజ్జీవులమేనని, వియ్యానికైనా, కయ్యానికైనా సమ ఉజ్జీలే కావాలని మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.