అన్నీ తప్పుడు ఆరోపణలే.. అవన్నీ నిజాలే…. బుగ్గన వర్సెస్ యనమల
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మధ్య ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ఆర్థిక పరిస్థితిపై యనమల అవాస్తవమైన, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి 48 వేల కోట్ల రూపాయలు వెళ్లాయంటూ టీడీపీ నేత యనమల ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను మంత్రి బుగ్గన ఖండించారు. అది వాస్తవిక వ్యయం కాదని, ఆ మొత్తం కూడా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బుక్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ అనే విషయాన్ని గ్రహించాలని మంత్రి కౌంటర్ ఇచ్చారు.
సీఎఫ్ఎంఎస్లో స్పెషల్ బిల్లులంటూ ఏవీ ఉండవని మంత్రి స్పష్టం చేశారు. బిల్లుల చెల్లింపులకు బీఎల్ఎం మాడ్యూల్ పొందుపర్చామని, ట్రెజరీ కోడ్ ప్రకారమే బిల్లుల చెల్లింపు వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. సీఎఫ్ఎంఎస్ రిపోర్టింగ్ విధానంలో ‘బుక్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్’ను గుర్తించడం కోసం స్పెషల్ బిల్లులు అనే పేరు పెట్టారని, అంతేకానీ స్పెషల్ బిల్లుల హెడ్ అనేది ఎక్కడా లేదని మంత్రి ఓ క్లారిటీ ఇచ్చారు. సీఎఫ్ఎంఎస్ను క్రమపద్ధతిలో వ్యవస్థీకృతం చేయలేదు. అందుకే బుక్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్లు స్పెషల్ బిల్లుల కింద చూపారని వివరించారు. ఇదంతా వివరిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి కాగ్‌కు ఓ లేఖ కూడా రాశారని వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగలేదని, అలాంటప్పుడు అవినీతి అంటూ ఎలా విమర్శలు చేస్తారని మంత్రి బుగ్గన సూటిగా ప్రశ్నించారు.
లొసుగులు బయటపడ్డాయనే తమపై విమర్శలు : యనమల రామకృష్ణుడు
కాగ్ సూచించిన నోటీసుల ఆధారంగానే తాను ప్రభుత్వంపై ఆరోపణలు చేశానని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా తాను ఆరోపణలు చేయనని, తనకు ఆ అలవాటు కూడా లేదని ప్రకటించారు. లొసుగులు బయటపడటంతో దిక్కు తోచక ప్రభుత్వం తనపై రివర్స్ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. సీఎఫ్ఎంఎస్ను బైపాస్ చేసి, బ్యాక్ఎండ్ లావాదేవీలను ఎలా అనుమతిస్తారంటూ యనమల సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక బిల్లుల పేరుతో 48 వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేయడం అంటే ట్రెజరీ కోడ్ ఉల్లంఘనే అవుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక మంత్రికి యనమల 12 ప్రశ్నలను సంధించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, వెంటనే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ప్రకటించాలని యనమల డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

