రెండు నెలల్లో సీపీఎస్‌కు పరిష్కారమార్గం: మంత్రి బొత్స భరోసా
ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ సమస్యకు రెండు నెలల్లోనే పరిష్కార మార్గం చూపిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భరోసా ఇచ్చారు. విజయనగరంలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహాసభలో మంత్రి బొత్స పాల్గొని...
విజయనగరం: ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ సమస్యకు రెండు నెలల్లోనే పరిష్కార మార్గం చూపిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భరోసా ఇచ్చారు. అలాగే, ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అక్టోబర్ ఒకటి నుంచి పీఆర్సీతో కలిపి జీతాలిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, దీనిపై క్యాబినెట్లో ప్రతిపాదన పెట్టాలని సబ్ కమిటీ సభ్యులకు సీఎం జగన్ సూచించారని బొత్స తెలిపారు. విజయనగరంలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహాసభలో మంత్రి బొత్స పాల్గొని ప్రసంగించారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంపై నెలకొన్న ప్రతిష్టంభనకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని, అది కూడా రెండు నెలల్లోనే పరిష్కారమవుతుందని బొత్స ఆశాభావం వ్యక్తం చేశారు. 2003, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి సీపీఎస్, ఓపీఎస్ రెండింటిలో ఏదో ఒకటి వర్తించేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై నెలరోజుల్లో క్లారిటీ ఇస్తామన్నారు. ఈ ఏడాది చివరికల్లా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. తన శాఖలో టీచర్లు మొదలుకుని ప్రొఫెసర్ల వరకు ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

