Minister Ambati | అమరావతి : ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేతపై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇటీవల భీమిలిలో వైసీపీ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన ‘ సిద్ధం’ కార్యక్రమంపై జనసేన నాయకులు తామూ సిద్ధమేనంటూ వేసిన పోస్టర్లపై అంబటి రాంబాబు(Minister Ambati ) స్పందించారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామంటూ జగన్(Jagan) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.
ఏపీలో పొత్తుల ఖరారును, పోటీ చేసే స్థానాలను , సీఎంగా ఎవరుంటారనే అంశాన్ని తేల్చకుండా చంద్రబాబు (Chandra Babu), పవన్‌కల్యాణ్(Pawan Kalyan) అయోమయ స్థితిలో ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబును బుజాన వేసుకొని తిరుగడానికి సిద్ధంగా ఉన్నారా? ప్యాకేజీ ఇస్తే ఎత్తుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ పవన్‌పై సెటైర్లు వేశారు. ప్రశ్నించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తవగానే ఏపీలో ఇండ్లు లేని వ్యక్తులు తట్ట, బుట్ట సర్దుకుని హైదరాబాద్‌లో ఉన్న ఇంటికి వెళ్లడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌ను విమర్శించారు.