శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో (Srisailam) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. శ్రీశైల మల్లికార్జున స్వామివారి ఆలయ సమీపంలో ఉన్న లలితాంబికా (Lalithambika) దుకాణ సముదాయంలో గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఎల్ బ్లాక్‌లోని విగిలిన షాపులకు విస్తరించాయి. దీంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
అయితే అప్పటికే 15 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. షార్ట్‌సర్య్కూట్ వల్లే మంటలు చెలరేగినట్లు నిర్ధారించారు. అగ్నిప్రమాదం ధాటికి సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.