Manchu Manoj | మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్త ఇటీవల వైరల్‌గా మారింది. మంచు ఫ్యామిలీతో విబేధాలు కలకలం రేపుతున్న తరుణంలో మనోజ్ జనసేనలోకి చేరుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తన పొలిటికల్ ఎంట్రీపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు.
శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం నాడు ఆళ్లగడ్డకు వచ్చిన మంచు మనోజ్.. రాజకీయాల్లోకి రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. పొలిటికల్ ఎంట్రీపై ప్రస్తుతానికి తానేమీ చెప్పలేనంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. మీరు జనసేనలోకి వెళ్లబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఏం సమాధానం చెబుతారని అడగ్గా.. నో కామెంట్స్ అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు.
తన అత్తయ్య శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు మాత్రమే ఆళ్లగడ్డకు వచ్చినట్లు మంచు మనోజ్ వివరించారు. తమ కూతురు దేవసేన శోభను తొలిసారిగా ఆళ్లగడ్డకు తీసుకొచ్చామని చెప్పారు. జయంతి రోజునే తీసుకొద్దామనే ఉద్దేశంతో ఇన్నాళ్లూ ఇక్కడకు తీసుకురాలేదని తెలిపారు. మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ఇక్కడకు వచ్చారని అన్నారు. తన కోసం ఆళ్లగడ్డకు తరలివచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Manchu Manoj responded to the campaigns that he is joining the Jana Sena Manoj said that he can’t say anything on this matter at the moment pic.twitter.com/DbF0ffzBOU
— Media5Zone News (@media5zone) December 16, 2024