Manchu Manoj | మోహన్‌బాబుకు చెందిన యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని AICTEకి పేరెంట్స్ అసోసియేషన్ లేఖ కూడా రాసింది. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో మంచు మనోజ్ స్పందించారు.
విద్యార్థుల ఆందోళన తనను బాధపెట్టిందని మంచు మనోజ్ అన్నారు. ఈ విషయాన్ని మోహన్‌బాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, AISFకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ అంశంపై యూనివర్సిటీ ఈడీ వినయ్‌ను వివరణ కోరానని పేర్కొన్నారు. రాయలసీమ వాసులు, విద్యార్థుల ప్రయోజనాలకే ఛాన్స్లర్ మోహన్‌బాబు ప్రాధాన్యమిస్తారని స్పష్టం చేశారు.