Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Resign | స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో అధికార టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో అధికార టీడీపీ (TDP)కి భారీ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ( Gunda Laxmidevi) టీడీపీకి రాజీనామా (Resign ) చేసి వైసీపీలో చేరారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన గుండా లక్ష్మీదేవి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా గుండా లక్ష్మీదేవికి వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
లక్ష్మీదేవి మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా టీడీపీ తన కుటుంబం ఎంతగానో సేవ చేసిందని తెలిపారు. సేవలను మరిచిపోయి తమను వెన్నుపోటు పొడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల కోసం ఎవరుంటే వారితో ఉండాలనుకున్నాను అని అన్నారు. ఆమె భర్త, దివంగత మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లక్ష్మీదేవితో పాటుగా ఆమె ముఖ్య అనుచరులు కూడా వైఎస్సార్సీపీలో చేరారు.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

