Accident In Chandragiri | చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో బస్సు బోల్తా
Accident In Chandragiri | ధర్మవరం నుంచి తిరుపతికి బయలుదేరిన ఓ టూరిస్ట్ బస్సు చంద్రగిరి బకరాపేట వద్ద లోయలో పడిపోయింది.
Accident In Chandragiri | ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతం నుంచి శనివారం బయలుదేరి వస్తున్న టూరిస్ట్ బస్సు బకారాపేట వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయింది. బస్సు 300 అడుగుల లోతున పడిపోవడంతో డ్రైవర్‌తోపాటు పలువురు మంది మరణించినట్లు తెలుస్తున్నది. తిరుపతిలో ఆదివారం పెండ్లి నిశ్చితార్థం కోసం పెండ్లి కొడుకు బంధువులు ఈ బస్సులో వస్తున్నారు. బస్సులో పెండ్లి కొడుకు వేణుతోపాటు 50 మంది కూడా ఉన్నారని సమాచారం.
40 మందికి గాయాలు అయ్యాయి. వారిని చికిత్సకోసం తిరుపతిలోని రుయా దవాఖానకు తరలించారు.వేణుతోపాటు మరో పది మంది పరిస్థితి విషమించిందని తెలుస్తున్నది. వీరిని చికిత్స కోసం తిరుపతి రుయా దవాఖానకు తరలించారు. అకస్మాత్‌గా బస్సు లోయలో పడిపోవడంతో వెనుక నుంచి వస్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనూహ్యంగా బస్సు లోయలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారు షాక్‌కు గురయ్యారు. పలువురు షాక్‌తో స్పృహ కోల్పోయారు.
మూడు అంబులెన్స్‌లు, ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సమాచారం తెలియగానే తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రాత్రి వేళ చిమ్మచీకట్లతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది. పోలీసులు తమ వద్ద ఉన్న టార్చి లైట్లతోనే బస్సులో వారిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

