Srisailam Temple | శ్రీశైలంలో ధ్వజారోహణం ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. Photos
Srisailam
2/14
శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
3/14
యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలయ్యాయి.
4/14
ఈవో శ్రీనివాసరావు దంపతులు, సంబంధిత అధికారులు, అర్చకులు, వేదపండితులు సంప్రదాయబద్దంగా ఆలయ ప్రాంగణంలోనికి స్వామివార్ల యాగప్రవేశం చేశారు.
5/14
అనంతరం చతుర్వేదపారాయణలు, వేదస్వస్తి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత లోక క్షేమాన్ని కాంక్షిస్తూ బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠించారు.
6/14
అనంతరం గణపతిపూజ, పుణ్యాహవచనం, చండీశ్వర పూజలు చేశారు. కంకణధారణ, రుత్విగ్వరణం, అఖండదీపస్థాపన, వాస్తుహోమం, రుద్రకలశ స్థాపన, పంచావరణార్చన, జపానుష్ఠాలు జరిపించారు.
7/14
సాయంత్రం బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించి.. సకల దేవతలకు ఆహ్వానం పలికారు.
8/14
ఆలయప్రాంగణంలో ప్రధాన ధ్వజస్తంభం పతాకావిష్కరించారు.
9/14
నూతన వస్త్రంపై పరమశివుడి వాహనమైన నందీశ్వరుడి చిత్రాన్ని తీర్చిదిద్ది.. ధ్వజస్తంభంపై ఆవిష్కరించారు.