AP News | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడి మోజులో పడిన ఓ వివాహిత పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఉండగానే ప్రియుడితో ఎఫైర్ నడిపింది. కానీ భార్య ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన ఆ భర్త ఆమె అక్రమ సంబంధాన్ని గుర్తించాడు. వారిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరకబట్టాడు. భార్య ముందే ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి పిల్లలు కూడా పుట్టారు. అన్యోన్యంగా వారి జీవితం సాగిపోతుండగా.. ఆ అమ్మాయి తప్పుదోవ పట్టింది. సోషల్‌మీడియాకు బానిసగా మారింది. ఈ క్రమంలోనే ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందిన ఇంజనీరింగ్ యువకుడు ఇంద్రశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ముదరడంతో హద్దులు దాటారు. ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు.
కొద్దిరోజులుగా ఆ అమ్మాయి ప్రవర్తనలో మార్పు రావడాన్ని ఆమె భర్త పసిగట్టాడు. దీనిపై ఎంక్వైరీ చేయగా ఇంజనీరింగ్ యువకుడితో తన భార్య పెట్టుకున్న ఎఫైర్ సంగతి తెలిసింది. దీంతో ఎలాగైనా వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర తన భార్య ఆమె ప్రియుడిని కలుసుకుంటుందని తెలిసి అక్కడికి వెళ్లాడు. భార్య వ్యవహారాన్ని అందరి ముందు బయటపెట్టి.. ఆమె ప్రియుడిని చితకబాదాడు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.
ఇన్‌స్టాలో ప్రేమ వ్యవహారం నడిపిన భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
మదనపల్లెకి చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వారికి పిల్లలు కూడా పుట్టారు.
కానీ ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రాంలో మరో ఇంజనీరింగ్ యువకుడితో చాట్ చేస్తూ ప్రేమ వ్యవహారం నడిపించింది.
వీరిద్దరూ ఓ చోట… pic.twitter.com/rbD3Hz6p5x
— Telugu Scribe (@TeluguScribe) December 8, 2024