అమరావతి : ఈనెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం (Low pressure) ఏర్పడనుందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా(RP Sisodia ) తెలిపారు. అల్పపీడనం రెండురోజుల్లో వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపారు. ఫలితంగా అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కేరళలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. వర్షాల కారణంగా వ్యవసాయ పనుల్లో రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విప్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.