అమరావతి : కడప జిల్లా ఖాజీపేటలో యువతి గొంతు కోసి హత్య చేసిన నిందితుడు ప్రేమోన్మాది వెంకటేశ్ శనివారం పోలీసుల ( Police ) పై దాడి చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ( Firing ) నిందితుడికి గాయాలు అయ్యాయి . యువతిపై దాడి, హత్య అనంతరం నిందితుడు వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా శనివారం తెల్లవారుజామున నిందితుడిని మైదుకూరు నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తుండగా తప్పించుకునేందుకు యత్నించి ఇద్దరు కానిస్టేబుళ్లను గాయపరిచాడు. పరారవుతున్న వెంకటేశ్‌పై పోలీసులు కాల్పులు జరపడంతో గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు, నిందితుడి కాళ్లపై మరో రౌండ్ కాల్పులు జరిపి పట్టుకున్నారు. కాల్పుల్లో గాయపడ్డ నిందితుడిని కడప రిమ్స్‌కు తరలించగా, దాడిలో గాయపడిన కానిస్టేబుళ్లు శివయ్య, బాలనర్సింహులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.