అమరావతి : పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాను చూసేందుకు ఎదురుచేస్తున్నానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈరోజు సినిమా విడుదల సందర్భంగా ఏపీలో పవన్ కల్యాణ్ సినిమాకు అద్భుత స్పందన వస్తోందని అన్నారు. ఏపీలో అడ్డంకులను అధిగమించి చిత్రం విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కో పరిశ్రమను ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. పరిశ్రమల ధ్వంసంతో రాష్ట్ర ప్రజలు భిక్షాటన చేసే పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. సినీ పరిశ్రమ కూడా ఇందుకు మినహాయింపు కాదని తెలిపారు.