Liquor | మందుబాబులకు ఏపీ ప్రభుత్వం కిక్కిచ్చే న్యూస్ చెప్పింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఇవాళ, రేపు అర్ధరాత్రి ఒంటిగంట దాకా మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం ఏపీలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, ఈవెంట్లు, టూరిజం డెవలప్మెంట్ కార్పరేషన్ హోటళ్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్ముకోవచ్చు. అదేవిధంగా వైన్‌షాపులను రాత్రి 12 గంటల దాకా తెరిచి ఉంచవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సాధారణంగా ప్రతిరోజు రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతాయి. కానీ నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయని భావించిన ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 31వ తేదీతో పాటు జనవరి 1వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతినిచ్చింది.