అమరావతి : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Union Minister Amit Shah) కు విజయవాడలో వామపక్షాల నుంచి నిరసనలు తగిలాయి. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను ( Ambedkar ) అవమానపరిచినందుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తు అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ను అవమానపరిచిన అమిత్ షాకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వడం దారుణమని అన్నారు. కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సీపీఎం నాయకుడు ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా గన్నవరం మండలం కొండపావులూరులో రూ. 160 కోట్లతో నూతనంగా నిర్మించిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ( ఎన్ఐడీఎం) జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం 10వ బెటాలియన్ కేంద్రాలను ఆదివారం ప్రారంభించేందుకు విజయవాడకు వచ్చారు.