తాడేపల్లి: ఏపీలో శాంతి భద్రతలు కుప్పకూలయ్యాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan ) మండిపడ్డారు. టీడీపీ మూకల దాడికి గురైన మాజీ మంత్రి విడుదల రజిని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో జగన్ ఫోన్లో పరామర్శించారు.
రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని, వైసీపీ నాయకులు ధైర్యంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు ఆటవిక పాలనను ఖండించాలని, పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకుండా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.