అమరావతి : కడప జిల్లా పులివెందులో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..గంజాయి, నాటుసారా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి 15 కిలోల గంజాయి 110 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.18 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విశ్వనాధ్ వివరాలను వెల్లడించారు.
కాగా, పట్టుబడిన వారిలో వివేకానందారెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొన్న భరత్ కుమార్ యాదవ్ కుడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.