అమరావతి : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ( Lakshmi Parvathi ) ఏపీ సీఎం చంద్రబాబు ( Chandra babu ) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రజల నుంచి లక్షల కోట్లు దండుకుని, రష్యా (Russia )లో తప్ప అన్ని దేశాల్లోనూ పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు.
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. పోలీసులు లాకప్‌డెత్‌లు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
చంద్రబాబు పాలనలో ప్రజలకు మిగిలింది బాధలు, ఏడుపులేనని , అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్గి ప్రకాష్‌రెడ్డి చంపాలని ప్రయత్నించి ఆయనపైనే కేసు నమోదు చేశారని ఆరోపిం చారు. వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టులను చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని పేర్కొన్నారు.