అమరావతి : కర్నూలు(Kurnool ) జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రైవేట్ బస్ దుర్ఘటన ఏపీ రవాణా శాఖ స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆయా ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సులను తనిఖీ ( Private Bus inspections ) చేశారు. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలతో కదిలిన అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై 289 కేసులు నమోదు( Case Registered) చేశారు . ఈ సందర్భంగా 18 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు.
అగ్నిమాపక పరికరాలు లేని ప్రైవేటు ట్రావెల్స్‌కు రూ.7.08లక్షల జరిమానాలు విధించారు. ఏలూరులో 55 కేసులు నమోదు చేసి మూడు ట్రావెల్స్ బస్సులను, తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు నమోదు చేసి 4 బస్సులను సీజ్ చేశారు. నిన్న కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ( DD01N9490) పల్సర్ బైకును ఢీకొట్టింది. బైకు ట్యాంక్ పేలడంతో బస్సు కింద ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి బస్సు మొత్తానికి వ్యాపించడంతో క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది సజీవదహనం కాగా మరో 27 మంది స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారు.