Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదానికి (Kurnool Bus Accident) సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు యాక్సిడెంట్లో మరణించిన బైకర్ శివశంకర్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ప్రమాదానికి ముందు శివశంకర్ పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. అతనితోపాటు బైక్‌పై మరో యువకుడు కూడా ఉన్నాడు. ఆ సమయంలో శివశంకర్ మద్యం మత్తులో ఉన్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
శుక్రవారం తెల్లవారుజామున 2.22 గంటల సమయంలో శివశంకర్‌తో పాటుగా అతడి స్నేహితుడు కలిసి పెట్రోల్ బంక్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కడే బైక్‌పై వెళ్లినట్టు ఆ వీడియోలో ఉంది. శివశంకర్ బంక్‌లో ఉన్న సమయంలో స్టంట్ చేయడం, తడబడుతున్నట్టుగా కూడా కనిపించింది. బైక్ స్టార్ట్ చేసి కొద్ది దూరం వెళ్లిన వెంటనే స్కిడ్ అయినట్టుగా వీడియోలో స్పష్టంగా ఉంది. దీంతో, అతడు మద్యం సేవించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివారులో జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.
కర్నూలు బస్సు అగ్ని ప్రమాదానికి కారణమైన యువకుడు ఇతడే
ప్రమాదం ముందు బైకర్ విజువల్స్
మద్యం మత్తులో పెట్రోల్ పంపు వద్దకు వెళ్ళిన బైకర్
బస్సు ప్రమాదంలో బైకర్ మృతి https://t.co/hI82VtiX0g pic.twitter.com/mTWjFhxFO8
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2025