 
                                                            తిరుమల : టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా కృష్ణమూర్తి వైద్యనాథన్ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో (TTD JEO) వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపం (Ranganayakula Mandapam) లో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని జేఈవో అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
 
                            