ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొత్త ఇసుక విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్త ఇసుక పాలసీకి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొత్త ఇసుక విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్త ఇసుక పాలసీకి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా పలు అంశాలపై కేబినెట్ చర్చించింది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధివిధానాలను ఖరారు చేసేందుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.
పౌరసరఫరాల శాఖ రూ.2వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్‌కు ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా కేబినెట్ భేటీలో చర్చించారు. జూలై 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలా? ఆర్డినెన్స్ తీసుకురావాలా? అనే దానిపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక శ్వేతపత్రాలను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

