అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం (AP Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఆర్డీఏ ( CRDA ) పరిధిని 8,352 చ.కి.మీకు పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) అధ్యక్షతన సచివాలయంలో బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది.
2014-18 మధ్య నీరు, చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపునకు , ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ (ప్రోహిబిషన్)కు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 రీఫెల్ బిల్లుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఏపీ జీఎస్టీ (GST )2024 చట్ట సవరణకు, ఎక్సైజ్ (Excise)చట్ట సవరణ ముసాయిదాకు సమావేశం ఆమోదం తెలిపింది.
కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ లక్ష్యాల సాధనకు , పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రులతో పాటు, రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి పాల్గొన్నారు.