Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వారికి ఈవో శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద ఆశీర్వచనం చేసి స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. శేషవస్త్రంతో సత్కరించారు. అలాగే స్వామి, అమ్మవార్లను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు ఈవో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు దర్శనాల అనంతరం.. ఆశీర్వచన మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేయగా.. ఈవో తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Rajakumari Ganiya