Mudragada | వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై జనసేన కార్యకర్త దాడికి దిగాడు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి ఆదివారం తెల్లవారుజామున గంగాధర్ అనే జనసేన కార్యకర్త ట్రాక్టర్ తీసుకుని వచ్చి బీభత్సం సృష్టించాడు. ఇంటి ముందు ర్యాంప్‌పై పార్క్ చేసిన కారును ఆ ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. అక్కడే ఉన్న వైసీపీ జెండాలను పీకేసి, ఫ్లెక్సీలను చించేశాడు. అనంతరం జై జనసేన అంటూ నినాదాలు చేశారు.
ఈ దాడిపై పోలీసులకు ముద్రగడ సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి వచ్చి పోలీసులు పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని జగపతి నగరానికి చెందిన గంగాధర్‌గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇది తాగిన మైకంలో చేసిన చర్యనా? లేదంటే ఎవరైనా కుట్రపూరితంగా చేయించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ముద్రగడ నివాసంపై దాడి జరిగిన విషయం తెలియగానే వైసీపీ శ్రేణులు, ముద్రగడ అభిమానులు హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
ముద్రగడ కారును ధ్వంసం చేసిన జనసేన కార్యకర్త
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటికి తెల్లవారుజామున మూడు గంటలకు ట్రాక్టర్‌తో వచ్చి హల్చల్ చేసిన జనసేన పార్టీకి చెందిన గనిశెట్టి గంగాధర్
జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ఇంటి ముందు పార్క్ చేసిన ముద్రగడ్డ కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టి… pic.twitter.com/99LLh0sb45
— Telugu Scribe (@TeluguScribe) February 2, 2025