Nagababu Tour in North Andhra | జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఖాయమైంది. జూన్ 1 నుంచి ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న శ్రీకాకుళం జిల్లా, జూన్ 2న విజయనగరం జిల్లా, జూన్ 3న విశాఖ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటించనున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనలో భాగంగా జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, నియోజకవర్గ నాయకులు, ఆయా విభాగాల కమిటీ నాయకులతో నాగబాబు సమావేశం కానున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఆలోచనవిధానం, పార్టీ భవిష్యత్ కార్యకలాపాల గురించి నాయకులు ఆయన దిశా నిర్దేశం చేస్తారు. అలాగే పార్టీ ఎదుగుదలకు సంబంధించి వారి నుంచి సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తారని ప్రెస్నోట్లో జనసేన పార్టీ తెలిపింది. అంతేకాకుండా జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న పలువురు నాయకులను పార్టీలోకి నాగబాబు ఆహ్వానించనున్నారని పేర్కొంది.
జూన్ 1 నుండి నాగబాబు గారు ఉత్తరాంధ్ర పర్యటన.. pic.twitter.com/WAHVozSuyS
— JanaSena Party (@JanaSenaParty) May 29, 2022