Bolisetti Srinivas | మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా సెల్వమణిపై తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా ఆడదో.. మగదో కూడా తెలియడం లేదని విమర్శించారు. నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బొలిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలే చెప్పాలని అన్నారు. కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని చెప్పకపోతే రప్పా రప్పాగాళ్లు రోడ్లెక్కి మాట్లాడుతున్నాని విమర్శించారు.
ఎమ్మెల్యే నా కొడుకులు అని రోజా అంటున్నారని.. అసలు అది ఆడదో.. మగదో తెలియదని బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కూడా రోజా కొడుకేనా అని ప్రశ్నించారు. జగన్ కూడా ఎమ్మెల్యేనే కదా అని అన్నారు. చంద్రబాబు కూడా ఆమె కొడుకేనా.. ఆయన కూడా ఎమ్మెల్యేనే కదా అని తెలిపారు. ఆయన వయసెంతా.. ఈమె వయసెంతా.. నా వయసెంతా.. ఆమె వయసెంతా అని ప్రశ్నించారు.
రోజా ఆడదా.. మగదో ఎవరికీ తెలియదు.. జగన్ కూడా దాని కొడుకేనా?
మనం సైలెంట్ ఉంటే ఈ రఫ్ఫా రఫ్ఫా గాల్లు రోడ్డెక్కి మాట్లాడుతుంటే మనం ఏం చేస్తున్నాం – జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ pic.twitter.com/tqjcm6JqFf
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2025
కొంతమంది కాపులను ఉసిగొల్పి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిస్తున్నారని బొలిశెట్టి అన్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి పనికిమాలినోళ్లంతా బయటకొచ్చి.. దమ్ముంటే అరెస్టు చేసుకోమని అంటున్నారని విమర్శించారు. వీళ్లంతా ఇండ్లలో ఉండే ఆడోళ్లని తిట్టి.. చంద్రబాబును తిట్టి.. కన్నాలేసి.. ఇవాళ కక్ష సాధింపు పేరుతో జైలుకు పంపిస్తున్నామని అంటున్నారని మండిపడ్డారు. వీళ్లు ఒక్కొక్కరి వెనకాల వేల కోట్ల కుంభకోణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని.. రాబోయే రోజుల్లో జగన్ను కూడా అరెస్టు చేస్తారని జోస్యం చెప్పారు. అందరు మామూలు దొంగలైతే.. జగన్ గజదొంగ అని విమర్శించారు. జగన్ లిక్కర్లో మొత్తం దోచుకున్నాడని.. గనులు దోచుకున్నాడు.. ఇసుక దోచుకున్నాడు.. అడవిని దోచుకున్నాడని తెలిపారు.
కూటమి నేతలపైనా బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ధర్మం ప్రకారం అన్ని పార్టీలకు సమాన హక్కులు ఉండాలని ఆయన అన్నారు. అసలు జనసేన 21 నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలుసా అని ప్రశ్నించారు. అందర్నీ ఒక దగ్గర కూర్చోబెట్టి డిబేట్ పెడితే తమ బాధేంటో అర్థమవుతందని చెప్పారు. మ నందరం కలిసి ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని, లేదంటే ఐదేళ్లు అడుక్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.