Bolisetty Sayanarayana | పదేండ్ల సమయం, డబ్బు ఖర్చుపెట్టినా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు.. జనసేన నేత ట్వీట్ వైరల్
Bolisetty Sayanarayana | జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. పదేండ్ల సమయాన్ని, డబ్బు ఖర్చుపెట్టినా తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనను పిలిచి మాట్లాడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Bolisetty Sayanarayana | జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. పదేండ్ల సమయాన్ని, డబ్బు ఖర్చుపెట్టినా తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనను పిలిచి మాట్లాడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సంపాదనను, కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతాల కోసం దశాబ్దం శ్రమించిన గుర్తింపు దక్కలేదని అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. అందులోనే మన ప్రభుత్వం వస్తుంది.. అందరికీ న్యాయం చేస్తుందని బొలిశెట్టి పేర్కొన్నారు. ఇప్పుడు కావాల్సింది సంయమనం.. చేయాల్సింది యుద్ధం అని రాసుకొచ్చారు.
అయితే బొలిశెట్టి సత్యనారాయణ చేసిన ట్వీట్ తొందరగానే వైరల్‌గా మారింది. తనకు టికెట్ రాకపోవడంతో బొలిశెట్టి అంసతృప్తి వ్యక్తం చేశారని సర్క్యూలేట్అయ్యింది. ఈ క్రమంలో ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా ఆయన మరోసారి స్పందించారు. పవన్ కళ్యాణ్ నుంచి తానేమీ ఆశించలేదని అన్నారు. సిద్ధాంతాల కోసం పోరాడే నాయకులకు తనకు చేతనైనంత సహాయం చేయడమే తనకు ఇష్టమని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో నేను ఆవేదన చెందుతున్నట్టు వార్త సర్క్యులేట్ అవ్వడం చూసి ఈ పోస్ట్ పెడుతూన్నా@PawanKalyan గారి నుండి నేను ఏమీ ఆశించలేదు, సిద్ధాంతాల కోసం పోరాడే నాయకులకు నాకు చేతనైనంత సహాయం చేయడం నాకు ఇష్టం
నా భావన ఫేస్ బుక్ లో చూస్తే అర్ధం అవుతుంది..
జై @JanaSenaParty pic.twitter.com/ciFNwH2ej2
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) March 14, 2024
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

