అమరావతి : ఏపీలో సంచలనం కలిగించిన జనసేన ఎమ్మెల్యే ( Jana Sena ) లైంగిక వేధింపుల ఘటనపై జనసేన అధిష్టానం సీరియస్‌గా దృష్టిని సారించింది. పార్టీకి చెందిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ( Arava Sridhar ) గత కొన్ని నెలలుగా లైంగికంగా వేధింపులకు ( sexual harassment) గురి చేస్తున్నాడని ఆరోపణలు చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది.
రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ. pic.twitter.com/Qw9ydOidyg
— JanaSena Party (@JanaSenaParty) January 28, 2026
కమిటీలో టి.శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టి.సి వరుణ్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీ ఎదుట ఎమ్మెల్యే శ్రీధర్ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కమిటీ ఇచ్చే నివేదికను పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని జనసేన స్పష్టం చేసింది. తుది నిర్ణయం వెలువడే వరకూ పార్టీ కార్యాక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఎమ్మెల్యేను ఆదేశించింది .